పాక్ ఫ్యాన్స్ కు హిట్ మ్యాన్ ఫిదా
వారి అభిమానం వెల కట్ట లేనిది
ముంబై – భారత క్రికెట్ జట్టు కెప్టన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తాము ఎక్కడికి వెళ్లినా పాకిస్తాన్ దేశానికి చెందిన క్రికెట్ ప్రేమికులను , అభిమానులను మరిచి పోలేమని స్పష్టం చేశారు. ఒక రకంగా పాక్ ఫ్యాన్స్ కు ఫిదా అయ్యారు హిట్ మ్యాన్.
వారి అభిమానం వెల కట్ట లేనిదని పేర్కొన్నారు. చాలా మంది ఇండియా, పాకిస్తాన్ మధ్య ఆడుతున్న సమయంలో యుద్ద వాతావరణం నెలకొంటుందని ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఆట అన్నాక గెలుపు ఓటములు ఉంటాయని స్పష్టం చేశారు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.
అయితే విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ తమను అమితంగా ఇష్ట పడతారని, అంతకంటే ఎక్కువగా అభిమానిస్తారని తెలిపారు. ప్రధానంగా సోషల్ మీడియాకు చెందిన ట్విట్టర్ , వాట్సాప్ , ఫేస్ బుక్, లింక్డ్ ఇన్ లలో విస్తృతంగా తమ అభిప్రాయాలను షేర్ చేస్తారని తెలిపారు. తమను వైరల్ చేయడంలో వారే కీలకంగా మారుతున్నారని ప్రశంసించారు రోహిత్ శర్మ.