తొలి ఇన్నింగ్సే కొంప ముంచింది
కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్
బెంగళూరు – బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది భారత జట్టు. ఈ సందర్భంగా స్కిప్పర్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచు కోవడంపై స్పందించారు. వర్షం పడడంతో పరుగులు తీసేందుకు వీలవుతుందని, బంతి టర్న్ కాదని అనుకున్నామని అన్నాడు.
విచిత్రం ఏమిటంటే కీవీస్ బౌలర్లు తమను తొలి ఇన్నింగ్స్ లో 46 రన్స్ కే పరిమితం చేయడం కీలకంగా మారిందన్నారు. తొలి నుంచే ఆధిపత్యం ప్రదర్శించినా ఆ తర్వాత తమ బౌలర్లు కట్టడి చేశారని, రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించడం జరిగిందన్నారు.
తనతో పాటు విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ లు అద్భుతంగా ఆడామాని, కానీ భారీ స్కోర్ చేసే సమయంలో ఔట్ కావడం కొంత ఇబ్బందికరంగా అనిపించిందని చెప్పాడు రోహిత్ శర్మ. విచిత్రం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న జట్టు తమదేనని కానీ తక్కువ స్కోర్ కే పరిమితం అవుతామని తాను కలలో కూడా అనుకోలేదన్నారు.
విచిత్రం ఏమిటంటే బంతి నేరుగా వికెట్లను తాకేలా స్వింగ్ కావడం తమను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టి వేసిందని, అదే తమను మానసికంగా కొంప ముంచేలా చేసిందని వాపోయాడు రోహిత్ శర్మ.