కీవీస్ తో ఓటమి బాధేస్తోంది – రోహిత్ శర్మ
కెప్టెన్ గా..ఆటగాడిగా విఫలం చెందాను
ముంబై – స్వదేశంలో ఎవరూ ఊహించని రీతిలో భారత క్రికెట్ జట్టు 3-0 తేడాతో టెస్టు సీరీస్ ను కోల్పోయింది. గెలవాల్సిన సమయంలో ఆటగాళ్లు ఆడక పోవడం, పలు చెత్త నిర్ణయాలు తీసుకోవడం కూడా ఓటమికి దారి తీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ సైతం టీమిండియా చేతులెత్తేసింది. తక్కువ పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించ లేక పోవడం విస్తు పోయేలా చేసింది. కీవీస్ చెప్పి మరీ వైట్ వాష్ చేసింది. బలమైన భారత జట్టుకు చుక్కలు చూపించింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ ఓటమికి, సీరీస్ కోల్పోవడానికి తాను పూర్తిగా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. పరాజయం తనను మరింత బాధకు గురి చేసిందన్నాడు.
పంత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నాడు. ప్రధానంగా కీవీస్ బౌలర్ అజాబ్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కితాబు ఇచ్చాడు .
సీరీస్ అసాంతం ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడిందన్నాడు. బెంగళూరు, పూణేలో ఎక్కువ రన్స్ చేయలేదన్నారు. ఒక్క ముంబై వాంఖడే స్టేడియంలోనే 30 రన్స్ ఎక్కువగా చేశామన్నాడు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని చెప్పాడు.