దర్జాగా ఐపీఎల్ 2025 కప్ రేసులోకి
ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ఆఖరు దశకు చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సూపర్ షో చేసింది. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ స్టాండింగ్ కెప్టెన్ జితేష్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తన జట్టుకు కీలకమైన విజయాన్ని అందించాడు. 85 పరుగులతో ఆకట్టుకున్నాడు. లక్నో వేదికగా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగింది. 70వ మ్యాచ్ ఇఇ. ఎల్ ఎస్ జీని 6 వికెట్ల తేడాతో ఓడించింది. మూడో అత్యధిక రన్స్ వేటను సాగించింది.
4 వికెట్లు కోల్పోయి 123 రన్స్ చేసిన సమయంలో మైదానంలోకి వచ్చిన జితేష్ శర్మ దుమ్ము రేపాడు. కేవలం 18.4 ఓవర్లలో 230 స్కోర్ సాధించింది. ఈ విజయంతో ఆర్‌సిబి పంజాబ్ కింగ్స్‌తో క్వాలిఫయర్ 1లో తలపడగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. అంతకు ముందు లక్నో సూపర్ జెయింట్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కో ల్పోయి 227 పరుగులు సాధించింది. కెప్టెన్ రిషబ్ పంత్ షాన్ దార్ సెంచరీ చేశాడు. 118 రన్స్ తో అజేయంగా నిలిచాడు. కానీ జట్టును గెలిపించలేక పోయాడు.
అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ జోర్దార్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది . జితేశ్ శర్మ కేవలం 33 బంతుల్లో 8 బౌండరీలు, 6 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. మయాంక్ అగర్వాల్ 23 బాల్స్ ఎదుర్కొని 41 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 61 రన్స్ జోడించారు. సాల్ట్ 19 బంతుల్లో 30 రన్స్ చేశాడు.