ఆసక్తి రేపుతున్న ఆర్సీబీ స్క్వాడ్
సమ తూకానికే ప్రయారిటీ
బెంగళూరు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ సమ తూకాన్ని పాటించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఆల్ రౌండర్ల విభాగాలలో పనికి వస్తారని అనుకున్న వారి పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈసారి మరింత బలోపేతంగా జట్టు ఉండాలని ఆశించింది. ఆ మేరకు కొనుగోలు చేసింది ఆటగాళ్లను. జెడ్డా వేదికగా జరిగిన వేలం పాట ముగిసింది.
విరాట్ కోహ్లీని రూ. 21 కోట్లకు , రజిత్ పాటిదార్ ను రూ. 11 కోట్లకు తీసుకుంది. వీరిద్దరూ బ్యాటింగ్ కు మూల స్తంభంగా ఉంటారు. ఇక బౌలింగ్ పరంగా యష్ దయాల్ ను రూ. 5 కోట్లకు కైవసం చేసుకుంది ఆర్సీబీ.
ఆసిస్ కు చెందిన జోష్ హాజిల్ వుడ్ తను ప్రధానంగా బౌలర్. ఇతడిని రూ. 12.50 కోట్లకు తీసుకుంది. వికెట్ కీపర్, బ్యాటర్ జితేష్ శర్మను రూ. 11 కోట్లకు, ఫిలిప్ సాల్ట్ ను రూ. 11.50 కోట్లకు, భువనేశ్వర్ కుమార్ ను రూ. 10.75 కోట్లకు చేజిక్కించుకుంది.
ఇంగ్లండ్ కు చెందిన లివింగ్ స్టోన్ ను రూ. 8.75 కోట్లకు , రసిఖ్ దార్ సలామ్ ను రూ. 6 కోట్లకు , కృనాల్ పాండ్యాను రూ. 5.75 కోట్లకు , టిమ్ డేవిడ్ ను రూ. 3. 00 కోట్లకు , జాకబ్ బథెల్ ను రూ. 2.60 కోట్లకు , నుయాష్ శర్మ ను రూ. 2.60 కోట్లకు, తుషారను రూ. 1.60 కోట్లకు, షెపర్డ్ ను రూ. 1.50 కోట్లకు, లుంగీ ఎంగిడిని రూ. 1 కోటికి తీసుకుంది ఆర్సీబీ.
వీరితో పాటు మనోజ్ భాండాగే ను రూ. 30 లక్షలకు, స్వస్తిక్ చికారాను రూ. 30 లక్షలకు, అభినందన్ సింగ్ ను రూ. 30 లక్షలకు, మోహిత్ రాఠీని రూ. 30 లక్షలకు, దేవదత్ పడిక్కల్ ను రూ. 2 కోట్లకు, స్వప్నిల్ సింగ్ ను రూ. 50 లక్షలకు చేజిక్కించుకుంది.