దంచి కొట్టిన శాంసన్…పరాగ్
జైపూర్ – ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా రాజస్ధాన్ లోని జైపూర్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో కేరళ స్టార్ క్రికెటర్ , కెప్టెన్ సంజూ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. లక్నో సూపర్ జెయింట్స్ ను 20 పరుగుల తేడాతో ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కిప్పర్ సంజూ శాసన్ దుమ్ము రేపాడు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 52 బంతులు ఎదుర్కొని 82 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్ లో సంజూ కీలక పాత్ర పోషించాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
కెప్టెన్ శాంసన్ కు తోడు రియాన్ పరాగ్ కూడా తోడు కావడంతో ధారాళంగా పరుగులు వచ్చాయి. ఇక పరాగ్ కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొని ఒక ఫోర్ 3 సిక్స్ లతో 43 రన్స్ చేశాడు. ధ్రువ్ జురేల్ 20 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆశించిన మేర రాణించ లేక పోయింది. ఓటమి మూటగట్టుకుంది.