100 పరుగుల తేడాతో ఘోర పరాజయం
రాజస్థాన్ – ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కోలుకోలేని షాక్ ఇచ్చింది స్వంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ కు. ఆ జట్టుకు ఇది ఆరో విజయం కావడం విశేషం. రాజస్థాన్ ను 100 పరుగుల తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో నిర్లక్ష్యంగా ఆడింది. మ్యాచ్ ను కోల్పోయింది రాజస్థాన్. 11 మ్యాచ్ లు ఆడిన జట్టు 8 మ్యాచ్ లలో ఓడి పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు భారీ స్కోర్ చేసింది. రికెల్టన్ 38 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 61 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ 36 బంతులు ఆడి 9 ఫోర్లతో 53 పరుగులు చేశాడు.
సూర్య కుమార్ యాదవ్ 23 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్సర్లతో 48 చేయగా, హార్దిక్ పాండ్యా 23 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు ఒక సిక్స్ తో 48 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 217 రన్స్ చేసింది. అనంతరం 218 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆదిలోనే చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత జైశ్వాల్ ను బౌల్ట్ పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. 16.1 ఓవర్లలోనే కుప్ప కూలింది కేవలం 117 పరుగులకే. కర్ణ్ శర్మ 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే బుమ్రా 15 రన్స్ ఇచ్చింది 2 వికెట్లు తీశాడు. ప్లే ఆఫ్స్ నుంచి ఈ ఓటమితో నిష్క్రమించింది రాజస్థాన్ రాయల్స్. ముంబై ఇండియన్స్ టాప్ లో నిలిచింది.