హెట్‌మైర్ టార్చ్ బేరర్
పంజాబ్ ఆశలపై నీళ్లు
ముల్లాన్ పూర్ – ఐపీఎల్ 2024లో మరో అరుదైన మ్యాచ్ జరిగింది. ఆద్యంతమూ విజయం ఇరు జట్లను ఊరించింది. కానీ అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో ఎక్కడా తొట్రుపాటుకు లోను కాకుండా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. విచిత్రం ఏమిటంటే గత ఐదేళ్లుగా పంజాబ్ తో జరిగే ప్రతీ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు స్టార్ విండీస్ క్రికెటర్ సిమ్రోన్ హిట్ మైర్. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖరి ఓవర్ లో మ్యాజిక్ చేశాడు. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ చివరి దాకా కష్ట పడాల్సి వచ్చింది గెలుపు కోసం.
ఓ వైపు వికెట్లు రాలుతున్నా టార్గెట్ మరింత భారంగా మారినా ఎక్కడా వెనుదిరిగి చూడలేదు హిట్ మైర్. కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సిమ్రోన్ ఒక ఫోర్ 3 సిక్స్ లతో 27 పరుగులు చేశాడు నాటౌట్ గా నిలిచాడు. రియల్ టార్చ్ బేరర్ గా గుర్తింపు పొందాడు.
రాజస్థాన్ రాయల్స్ కు అద్భుత సక్సెస్ అందించిన హిట్ మైర్ కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.