కీలక లీగ్ మ్యాచ్ కు రెఢీ
జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా కీలకమైన మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో పోటీ పడనుంది. ఐపీఎల్ పునః ప్రారంభం సందర్బంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ పూర్తిగా వర్షం కారణంగా రద్దయింది. ఈ తరుణంలో 59వ మ్యాచ్ కు సిద్దమయ్యాయి ఇరు జట్లు. ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ ఆడతాడా లేదా అన్నది అనుమానం నెలకొంది. రాహుల్ ద్రవిడ్ వచ్చాక తనను పూర్తిగా పక్కన పెట్టేశాడు. వచ్చే సీజన్ లో నైనా తనను ఆడిస్తాడా లేదా అన్నది అనుమానంగా ఉందని ఫ్యాన్స్ మండి పడుతున్నాడు.
మరో వైపు వైభవ్ సూర్యవంశీని, రియాన్ పరాగ్ ను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వచ్చాడు. ఇదే సమయంలో కేవలం స్టాండ్ కే పరిమితం అయ్యాడు సంజూ శాంసన్. గాయం నుంచి కోలుకున్నా ఇంకా మ్యాచ్ లో ఆడించక పోవడం పట్ల ఫైర్ అవుతున్నారు స్టార్ ప్లేయర్ ఫ్యాన్స్. ఇక టోర్నీ విషయానికి వస్తే రాజస్థాన్ కు ఈసారి కలిసి రాలేదని చెప్పక తప్పదు. మూడు మ్యాచ్ లను కేవలం ఒకటి రెండు పరుగుల తేడాతో పోగొట్టుకుంది. ఇది బిగ్ లాస్ ఆ జట్టుకు. ఇక నాయకత్వ లోపం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. శాంసన్ లోటు తెలుస్తోంది. అయినా ద్రవిడ్ లో మార్పు రావడం లేదు. ఈ మ్యాచ్ లో గెలిచినా లేక ఓడినా ఫరక్ లేదు రాజస్థాన్ కు. ఇక గెలవడం తప్పనిసరిగా మారింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు.