సామాన్య భక్తులకే పెద్దపీట
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కోట్లాది మంది భావించే తిరుమల పుణ్య క్షేత్రానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. భారీ ఎత్తున నగదుతో పాటు ఆభరణాలు, వజ్రాలు, విదేశీ కరెన్సీ సైతం భక్తులు సమర్పించుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ప్రాజెక్టులకు విరాళాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చారు వైజాగ్ లోని హిందూస్తాన్ అసోసియేట్స్ కు చెందిన మస్తాన్ రావు కుటుంబీకులు.
ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు. టీటీడీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేస్తోందన్నారు. సలహాలు, సూచనలు తీసుకుని ఎప్పటికప్పుడు త్వరితగతిన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఏఈవో ఈ సందర్బంగా. ఇప్పటికే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు వెంకయ్య చౌదరి.