సీఎం రిలీజ్ చేశారని వెల్లడించిన మంత్రి నిమ్మల
అమరావతి – ఇరిగేషన్ పనుల నిర్వహాణ, మరమ్మత్తుల కోసం చంద్రబాబు రూ. 344 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. వందల,వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసిపి ప్రభుత్వం మెయింటెన్స్ కూడా లేకుండా గాలికి వదిలి వేసిందన్నారు.తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనులు కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించామన్నారు.
రూ.10 లక్షల లోపు ఉన్న పనులను, సాగు నీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని స్పష్టం చేశారు మంత్రి. వైసిపి ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి తీయకపోగా షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మత్తులు చేయకపోగా, గ్రీజు కూడా పెట్ట లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం తప్పిదాలను సరి చేసుకుంటూ, ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్ నెలలో రూ 90 కోట్లతోనూ, సెప్టెంబర్ లో అత్యవసర పనులు రూ 326 కోట్లతో నిర్వహణ పనులు చేపట్టామన్నారు నిమ్మల రామానాయుడు.
ఇరిగేషన్ అధికారులు కింది స్దాయి నుండి పై స్దాయి వరకు స్వీయ పర్యవేక్షణ చేస్తూ, మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి నిమ్మల.