వినోద్ కుమార్ మల్టీ ప్లెక్స్ లో కోట్లు
రూ. 6,67,32,05 నగదు స్వాదీనం
కరీంనగర్ జిల్లా – భారత రాష్ట్ర సమితి పార్టీ మాజీ ఎంపీ, ప్రస్తుత కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బోయనపల్లి వినోద్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు చెందిన కరీంనగర్ లోని ప్రతిమ మల్టీ ప్లెక్స్ పై పోలీసులు దాడులు జరిపారు. ఇందులో భారీ నగదు ఉన్నట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు.
దాడులు నిర్వహించిన పోలీసులు విస్తు పోయారు. వినోద్ కుమార్ చాలా తెలివిగా అట్ట పెట్టెల్లో దాచి పెట్టిన డబ్బులను కనుగొన్నారు. ఏకంగా రూ. 6 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో దాదాపు రూ. 6,67,32,050 కోట్ల రూపాయలు లభించాయని, అన్నీ నోట్ల కట్టలేనని చెప్పారు.
తెల్ల వారు జామున 1.30 గంటలకు పోలీసులు మల్టీ ప్లెక్స్ లోకి ప్రవేశించారు. గంటల తరబడి సోదాలు జరిపారు. ఇదిలా ఉండగా ప్రతిమ ప్లెక్స్ వినోద్ కుమార్ ది కావడం విశేషం. ఆయన బంధువుల పేరుతో దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు. మాజీ ఎంపీ తన రాజకీయ కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు.
పైకి నీతి సూత్రాలు వల్లించే వినోద్ కుమార్ ఇలా అడ్డంగా దొరకడం విస్తు పోయేలా చేసింది.