NEWSTELANGANA

ఏఈ ఇంట్లో 4 కేజీల బంగారం

Share it with your family & friends

రూ. 65 ల‌క్ష‌ల న‌గ‌దు ల‌భ్యం

హైద‌రాబాద్ – అవినీతి తిమింగ‌లాలు ఒక్క‌టొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయి. నిన్న హెచ్ఎండీఏలో మాజీ డిప్యూటీ డైరెక్ట‌ర్ గా ఉన్న శివ బాలాజీ ఇంట్లో, ఇత‌ర ప్రాంతాల్లో జ‌రిపిన సోదాల్లో లెక్క‌కు మించి స్థ‌లాలు, భూములు, ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్స్ , ఆభ‌ర‌ణాలు ల‌భించాయి. వాటి బ‌హిరంగ మార్కెట్ విలువ క‌నీసం రూ. 250 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా.

ఇది ఇలా ఉండ‌గానే ఆరోగ్య శాఖ‌లో సూప‌రింటెండెంట్ గా ప‌ని చేస్తున్న వ్య‌క్తిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. లంచం తీసుకుంటూ దొరికి పోయాడు. మ‌రో వైపు ఓ త‌హసిల్దార్ తో పాటు డ్రైవ‌ర్ ను రూ. 10 ల‌క్ష‌ల‌తో ప‌ట్టుకున్నారు అవినీతి అధికారులు.

తాజాగా మ‌రో అవినీతి చేప ఏసీబీ చేతికి చిక్కింది. విచిత్రం ఏమిటంటే మ‌హిళ కావ‌డం విస్తు పోయేలా చేసింది. హైద‌రాబాద్ లోని గిరిజ‌న భ‌వ‌న్ లోని గిరిజ‌న సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ జ‌గ జ్యోతిని అరెస్ట్ చేశారు.

ఆమె ఇంట్లో సోదాలు చేప‌ట్టిన అధికారుల‌కు దిమ్మ తిరిగి పోయింది. ఏకంగా 4 కేజీల బంగారం, రూ. 65 ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రూ. 84,000 లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు.