ప్రశ్నించే గొంతును గెలిపించండి
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నల్లగొండ జిల్లా – బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ పార్టీ తరపున ఖమ్మం – నల్లగొండ – వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ పిలుపునిచ్చారు.
మంగళవారం నల్లగొండలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. విద్యాధికుడు, ప్రజల తరపున ప్రశ్నించే గొంతుక రాకేశ్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. లేక పోతే ఇబ్బందులు ఏర్పడుతాయని హెచ్చరించారు.
తెలంగాణకు చెందిన పట్టభద్రులు , నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరైనా సరే ముందు ప్రశ్నలు లేవదీసే వారిని ఆదరించాలని కోరారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు.
రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో సీఎం విఫలం అయ్యారంటూ మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇకనైనా మాటలు చెప్పే వారిని కాకుండా మీ అందరి తరపున వాయిస్ వినిపించే రాకేష్ రెడ్డిని గెలిపించాలని అన్నారు.