TELANGANANEWS

రాకేశ్ రెడ్డి గెలుపు అభివృద్దికి మ‌లుపు

Share it with your family & friends

పిలుపునిచ్చిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ నాయ‌కుడు, నాగ‌ర్ క‌ర్నూల్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విద్యాధికుడైన రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాల‌ని , దీని వ‌ల్ల మ‌రింత అభివృద్ది జ‌రుగుతుంద‌న్నారు.

వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం – న‌ల్ల‌గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఆరు గ్యారెంటీల పేరుతో జ‌నాన్ని నిట్ట నిలువునా మోసం చేశారంటూ కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు.

ఉన్న వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి ద‌క్కుతుంద‌న్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. చ‌ట్ట స‌భ‌ల్లో విద్యాధికులు ఉంటే మేలు జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌జ‌ల గొంతుక వినిపించే స‌త్తా ఉన్న వ్య‌క్తి రాకేశ్ రెడ్డి అంటూ కితాబు ఇచ్చారు .

నిరుద్యోగులు, ప‌ట్ట భ‌ద్రులు ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని మీ విలువైన ఓటును రాకేశ్ రెడ్డికి వేయాల‌ని పిలుపునిచ్చారు.