Friday, April 11, 2025
HomeNEWSఇవాల్టి నుంచి సీఎం మారితే బెట‌ర్ - ఆర్ఎస్పీ

ఇవాల్టి నుంచి సీఎం మారితే బెట‌ర్ – ఆర్ఎస్పీ

రేవంత్ రెడ్డి వినూత్నంగా బ‌ర్త్ డే విషెస్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బ‌ర్త్ డే విషెస్ ను వినూత్నంగా తెలిపారు. ఎక్స్ వేదిక‌గా శుక్ర‌వారం ఆయ‌న స్పందించారు. కనీసం ఈ రోజు నుండైనా మీరు ప్రతీకారం నుండి ప్రగతి వైపు పయనించాలని కోరారు. గాసిప్స్ పై కాకుండా గవర్నెన్స్ పై దృష్టి సారించాలని సూచించారు ఆర్ఎస్పీ.

తమరి భాషలో తిట్లు, ఒట్లు కాకుండా తియ్యటి మాటలు జాలు వారాలని, తెలంగాణ సంపదను కేవలం మెఘా, రాఘవ కంపెనీలకు మాత్రమే కాకుండా బహుజన వర్గాలకు కూడా సమానంగా పంచాలని కోరారు.

మీడియాలకు అబద్ధపు లీకులు ఇవ్వ‌కుండా బహిరంగ చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. కుటుంబాలు సరదాగా జరుపుకునే పండగలను ‘రేవ్’ పార్టీలు అని అనొద్దని హిత‌వు ప‌లికారు ఆర్ఎస్పీ.

కేవలం కాంగ్రేసు కంప్లయింట్స్ ను మాత్రమే కాకుండా ఇతర పార్టీల కంప్లయింట్స్ పై కూడా కేసులు చేయాలని, నిరుద్యోగులకు శాపంగా మారిన జీవో 29 ను రద్దు చేయాలని, తెలంగాణ పోలీసులనందరినీ ఒకటేలా చూడాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజలకు జరిగిన మంచిని రాజకీయాలకు అతీతంగా కొనసాగించాలని. కోరుకుంటున్న‌ట్లు తెలిపారు .

RELATED ARTICLES

Most Popular

Recent Comments