NEWSTELANGANA

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి దారుణం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ

హైద‌రాబాద్ – రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని హుజూరాబాద్ లో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శాంతియుతంగా నిరసన చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

దళితులు, వారి గోడును ప్రభుత్వానికి తెలియ జేయాలని పోరాడుతున్న ఎమ్మెల్యే పై పోలీసులు పాశ‌వికంగా దాడి చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి చేతకానితనం అని మండిప‌డ్డారు.. మీది ఇందిరమ్మ అభయ హస్తం కాదు, భయానక దళిత వ్యతిరేక హస్తం అని ఆరోపించారు.. ప్రజా కోర్టు లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చ‌రించారు.

ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క పోవ‌డాన్ని ప్ర‌శ్నిస్తే అడ్డుకుంటారా, దాడుల‌కు పాల్ప‌డ‌తారా అని నిల‌దీశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు మానుకోవాల‌ని అన్నారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ ఇంకో వైపు ఇచ్చిన హామీల‌కు మంగ‌ళం పాడుతూ పోరాడుతున్న వారిప‌ట్ల
క‌ర్క‌శ‌కంగా వ్య‌వ‌హరిస్తే ఎలా అని ప్ర‌శ్నించారు .