ఆమె ఆత్మకు శాంతి కలగాలి
హైదరాబాద్ – బీఎస్పీ బాస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శుక్రవారం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలయ్యారు. ఈ సందర్బంగా ఆమె అకాల మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ ఆమె మృతి తనను విస్తు పోయేలా చేసిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా లాస్య నందిత వయసు 33 ఏళ్లు. ఆమె తండ్రి కంటోన్మెంట్ సాయన్న ప్రముఖ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు ప్రజా సేవకుడిగా మంచి పేరుంది. ఆయన మృతితో భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ ఏరికోరి తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ తరపున టికెట్ ఇచ్చారు.
లాస్య నందిత తన సమీప ప్రత్యర్థి దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెలపై గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. విచిత్రం ఏమిటంటే మాజీ ఎమ్మెల్యే సాయన్న మరణించిన సంవత్సరం లోపే ఎంతో గొప్ప భవిష్యత్తు కలిగిన కూతురు లాస్య నందిత మృతి చెందడం తనను కలిచి వేసిందని వాపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.