పూర్ణచందర్ రావుకు ఆర్ఎస్పీ కంగ్రాట్స్
బీఎస్పీలో చేరనున్న మాజీ ఐపీఎస్
హైదరాబాద్ – బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి, తెలుగు రాష్ట్రాలకు అత్యున్నత సేవలు అందించిన ఘనత మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జే. పూర్ణ చందర్ రావుకు దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా ఆయన త్వరలోనే బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు.
శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా, విశాఖపట్నం కమీషనర్ గా, ఆర్టీసీ ఎం డీ గా, ఏసీబీ డీజీగా, తెలంగాణ పోలీసు రిక్రూట్మెంటు బోర్డు ఛైర్మన్ గా జే. పూర్ణ చందర్ రావు విశిష్టమైన సేవలు అందించారని ప్రశంసలు కురిపించారు.
ప్రజలకు విశిష్టమైన సేవలు అందిస్తూ నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏపీలో బీఎస్పీకి సంబంధించి పూర్ణ చందర్ రావు చేరికతో మరింత బల పడుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన వర్గాలకు ఎనలేని మేలు జరుగుతుందని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.