NEWSTELANGANA

ఏఈఈ అభ్య‌ర్థుల‌కు ఆర్ఎస్పీ అండ

Share it with your family & friends

కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకంపై ఫైర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ఇప్ప‌టి వ‌ర‌కు నియామ‌క ప‌త్రాలు ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. ఇది అత్యంత బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద త‌మ‌ను అపాయింట్ చేయాల‌ని కోరుతూ అభ్య‌ర్థులు మోకాళ్ల‌పై కూర్చుని నిర‌స‌న తెల‌ప‌డం దారుణ‌మ‌న్నారు. ఇదేనా ప్ర‌జా పాల‌న అంటూ ప్ర‌శ్నించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పూర్త‌యింద‌ని , కానీ ఇప్ప‌టి దాకా ఉలుకు ప‌లుకు లేక పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏఈఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి వెంట‌నే నియామ‌క ప‌త్రాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.