NEWSTELANGANA

జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్ ఫ‌లితాల మాటేంటి..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను ప్ర‌శ్నించారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో జాబ్స్ భ‌ర్తీ చేసే విష‌యంలో ఎందుకు తాత్సారం చేస్తున్నార‌నే దానిపై నిల‌దీశారు ఆర్ఎస్పీ.

గత 2022 సంవ‌త్స‌రంలో నోటిఫై చేసిన జూనియర్ లెక్చరర్స్ పోస్టులను ముందు భర్తీ చేయకుండా డీయస్సీ పోస్టులను భర్తీ చేస్తే గురుకులాల్లో లాగా మళ్లీ వేల బ్యాక్ లాగ్ పోస్టులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనిపై దృష్టి సారించాల‌ని కోరారు.

జూనియర్ లెక్చరర్స్ కు అప్లై చేసిన వాళ్లే చాలా మంది డీయస్సీ కూడా అప్లై చేసి ఉంటారని అన్నారు.
జనరల్ గా జూనియర్ లెక్చరర్ జీతం ఎక్కువ కాబట్టి, వాళ్లు డీయస్సీ లో టీచర్ గా సెలెక్ట్ అయినా చాలా మంది ఎక్కువ జీతం ఉన్న జేఎల్ పోస్టు కే పోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు .

అప్పుడు డీయస్సీ పోస్టులు భారీగా ఖాళీ అవుతాయ‌ని, ఇప్పుడు రిలింక్విష్మెంట్ ఆప్షన్ లేదంటున్నారు కాబట్టి ఖాళీలను ఈ మెరిట్ లిస్టుతో భర్తీ చేయలేమ‌ని అన్నారు ఆర్ఎస్పీ. అందుకే మళ్లీ పరీక్ష పెట్టాలి. అది ఎప్పుడయితదో తెల్వదని అన్నారు.

అందుకే వెంటనే TGPSC ని JL పరీక్ష ఫలితాలు ఇచ్చి రిక్రూట్మెంట్ పూర్తి చేయమని ఆదేశించాల‌ని కోరారు దీనివల్ల వేల మంది డీయస్సీ అభ్యర్థులకు లాభం చేకూరుతుంద‌ని, బ్యాక్ లాగ్ స‌మ‌స్య కూడా ఉత్ప‌న్నం కాద‌ని స్ప‌ష్టం చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

తాను గతంలో జరిగిన గురుకుల రిక్రూట్మెంట్ సమయంలో కూడా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువచ్చానని తెలిపారు . కాని మీరు విన్నట్లు నటించారు కాని సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయలేద‌ని ఆరోపించారు.