కేసీఆర్ నాయకత్వం స్వర్ణ యుగం
బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – నిన్నటి దాకా మాజీ సీఎం కేసీఆర్ ను అనరాని మాటలు అని, నిప్పులు చెరిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నట్టుండి స్వరం మార్చారు. తనది బహుజన వాదమని, డాక్టర్ అంబేద్కర్, పూలే, నారాయణ గురు, కాన్షీరాం బాటలో నడుస్తానని, వారే తనకు ఆదర్శం అంటూ చిలుక పలుకులు పలికిన ఆర్ఎస్పీ ఉన్నట్టుండి జంప్ అయ్యారు.
మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అధికారంలో లేక పోవడం దురదృష్టకరని అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వర్ణ యుగంగా మారిందని కితాబు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే అసమర్థులు, పిరికి పందలు, స్వార్థపరులు గొర్రెల మందల్లా వెళుతున్నారని ఆరోపించారు.. ప్రవీణ్ కుమార్ ఆ గొర్రెల మందలో ఒకడు కాదని స్పష్టం చేశారు.