తెలంగాణ..బహుజన వాదం ఒక్కటే
బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – బీఎస్పీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నమస్కరించారు. నివాళులు అర్పించారు.
అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వాదం..బహుజన వాదం వేర్వేరు కాదన్నారు. ఈ రెండు వాదాలు ఒక్కటేనని స్పష్టం చేశారు. ఈ రెండింటి వాదాలలో అణచితపై ప్రశ్నిస్తూ వస్తాయని అన్నారు. బలమైన తెలంగాణ కోసం కేసీఆర్ సారథ్యంలో ప్రయత్నం చేయడం జరిగిందన్నారు.
చాలా మంది నేతలు తన గురించి అవాకులు, చెవాకులు పేలుతున్నారని వారికి తాను చెప్పేది ఒక్కటేనని ఆ సమాధానం తెలంగాణ ప్రజల కోసం తప్ప ఇంకోటి కాదని పేర్కొన్నారు. బలమైన తెలంగాణను నిర్మించే యజ్ఞంలో భాగం అయ్యేందుకు తాను బీఆర్ఎస్ లో చేరడం జరిగిందని చెప్పారు. తనకు మంచి ఛాన్స్ ఇచ్చినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.