నాపై వస్తున్న వదంతులు నమ్మొద్దు
హైదరాబాద్ – బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోందని, ఈ విషయం తన దృష్టికి వస్తోందని పేర్కొన్నారు. తాను ప్రజల కోసం పని చేసే వ్యక్తినని, వారి సమస్యలకు గొంతుకగా ఉండాలనే తాను విధుల నుంచి తప్పుకున్నానని గుర్తు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఒకవేళ అదే సర్వీసులో ఉండి ఉంటే తనకు నెలా నెలా భారీ ఎత్తున జీతంతో పాటు సౌకర్యాలు అందేవని పేర్కొన్నారు బీఎస్పీ చీఫ్. విచిత్రం ఏమిటంటే రాజకీయం చేయడం కోసం తాను పాలిటిక్స్ లోకి రాలేదని స్పష్టం చేశారు ఆర్ఎస్పీ.
తనపై వస్తున్న వదంతులను నమ్మ వద్దని కోరారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు. తాను కరవు జిల్లా నుంచి వచ్చిన వాడినని, కష్టం అంటే ఏమిటో తనకు బాగా తెలుసన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.