NEWSTELANGANA

నాగంతో ఆర్ఎస్పీ భేటీ

Share it with your family & friends

రాజ‌కీయ ప‌రిణామాల‌పై చర్చ

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – మాజీ మంత్రి , బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్ నాగం జ‌నార్ద‌న్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు గులాబీ జెండా క‌ప్పుకున్న బీఎస్సీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించారు.

ఇటీవ‌లే ఆయ‌న బీఎస్పీని వీడారు. ఆ పార్టీ పొత్తుకు ఒప్పుకోక పోవ‌డం వ‌ల్ల‌నే తాను పార్టీని వీడాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు ఆర్ఎస్పీ. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర రాజ‌కీయాల‌లో త‌మ‌దైన ముద్ర వేశారు నాగం జ‌నార్ద‌న్ రెడ్డి. ఇక పోలీస్ ఆఫీస‌ర్ గా , ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ గా, గురుకాల‌లో పిల్ల‌ల‌ను ప్ర‌యోజ‌కుల‌ను త‌యారు చేసిన వ్య‌క్తిగా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

ఇక నాగం జ‌నార్ద‌న్ రెడ్డి, ఆర్ఎస్పీ ఇద్ద‌రూ ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన వారే కావ‌డం విశేషం. అంతే కాదు ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి సైతం ఇదే ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కావ‌డం విశేషం.

మొత్తంగా ఇద్ద‌రు భేటీ కావ‌డం , రాజ‌కీయాల‌పై చ‌ర్చించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.