కవితను కలిసిన ఆర్ఎస్పీ
పరామర్శించిన బాల్క సుమన్
న్యూఢిల్లీ – బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి శుక్రవారం న్యూఢిల్లీలోని తీహార్ జైలును సందర్శించారు. ఈ సందర్బంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని లిక్కర్ దందాలో క్వీన్ గా పేరు పొందిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలుసుకున్నారు.
ముందే అనుమతి తీసుకున్న ఈ ఇద్దరు ఆమెను పరామర్శించారు. కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందిన ఆర్ఎస్పీ ఇటీవలే ఎన్నికల కంటే ముందు బీఆఎస్పీ చీఫ్ పదవికి గుడ్ బై చెప్పారు.
అనంతరం ఎవరూ ఊహించని రీతిలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది. అయితే లిక్కర్ దందాలో కవిత కీలక పాత్ర పోషించిందని పూర్తి నివేదిక ఇచ్చింది. ఆమెను బయటకు వదిలితే కేసుకు సంబంధించి ఆధారాలను చిటికెలో తారు మారు చేస్తుందని ఆరోపించింది ఈడీ. అంతే కాదు ఇప్పటికే డేటా ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఐ ఫోన్లను ధ్వంసం చేసిందని తెలిపింది.