రామోజీ మృతి బాధాకరం
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శనివారం తెల్లవారుజామున 4.15 గంటలకు తుది శ్వాస విడిచారు .
ఈ సందర్బంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు రామోజీరావు గురించి. ఆయన మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. నిత్యం కొత్తదనంతో ఎన్నో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు రామోజీరావు అని కొనియాడారు.
ఇదీ సంగతి, నమ్మలేని నిజాలు, ఇది కథ కాదు, ఫాంటమ్ లాంటి విలక్షణీయ ఫీచర్స్ తో ఈనాడు పత్రికను రామోజీ నడిపిన తీరు అమోఘమని ప్రశంసలు కురిపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పత్రికలను చదివే అలవాటు ఈనాడు నుండే వచ్చిందన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.
తను స్థాపించిన సంస్థల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధి కల్పించిన ఘనమైన చరిత్ర ఆయనదని కొనియాడారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.