Saturday, April 19, 2025
HomeNEWSమ‌హిళ‌ల ఉపాధిపై ఫోక‌స్ పెట్టాలి

మ‌హిళ‌ల ఉపాధిపై ఫోక‌స్ పెట్టాలి

పిలుపునిచ్చిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

ములుగు జిల్లా – యువ‌త‌, మ‌హిళ‌లు త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. సోమ‌వారం ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ యువ నేత భూక్య జంప‌న్న నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన జంప‌న్న చారిట‌బుల్ ట్ర‌స్ట్ ను ప్రారంభించారు.

సామాజిక సేవ చేయాల‌న్న దృఢ సంక‌ల్పంతో జంప‌న్న నాయ‌క్ ట్ర‌స్ట్ ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు ఆర్ఎస్పీ.

ట్రస్ట్ ఆధ్వర్యంలో యువత, మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చూడాల‌ని అన్నారు. స్వ‌శ‌క్తితో స్వ‌యం ఉపాధి పొందేలా శిక్ష‌ణ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు.

ఈ సందర్భంగా దివ్యాంగుడైన నగావత్ బాలు నాయక్ కు ట్రై మోటార్ సైకిల్ ను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. జంప‌న్న నాయ‌క్ ను మ‌రికొంద‌రు స్పూర్తిగా తీసుకోవాల‌ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments