కందనూలు రుణం తీర్చుకుంటా
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీ
నాగర్ కర్నూల్ జిల్లా – బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. ప్రత్యేకించి నా ప్రాంతానికి సేవ చేయాలన్న సత్ సంకల్పంతోనే బరిలో ఉన్నానని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తెలంగాణ బ్లాక్ వాయిస్ ఫౌండర్ శ్రీదర్ గోవిందు సారథ్యంలో ఆర్ఎస్పీ సపోర్టర్స్ మీట్ కార్యక్రమం చేపట్టారు. తనను ఎంపీగా గెలిపించేందుకు పార్లమెంట్ పరిధిలోని యువ ఓటర్లంతా కలిసి స్వచ్చందంగా ఒక్క రూపాయి చొప్పున డబ్బులు సేకరించారు. ఈ సందర్బంగా వచ్చిన మొత్తం డబ్బులు రూ. 17,500 తనకు అందజేశారని కొనియాడారు. వారి ప్రయత్నానికి తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతపు అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. పేదింటి పిల్లల భవిష్యత్తును కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఆర్ఎస్పీ.