కాంగ్రెస్ సర్కార్ పాలన బేకార్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో కొలువు తీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మంగళవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా అన్న అనుమానం తనకు కలుగుతోందని పేర్కొన్నారు.
ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందని వాపోయారు. బహుజనులకు చెందిన నేతలకు గుర్తింపు ఇవ్వక పోవడం దారుణమన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం రౌడీ పాలన సాగుతోందని, పూర్తిగా గాడి తప్పిందని ధ్వజమెత్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇలాంటి పాలననా తాము కోరుకున్నది అని నిలదీశారు . ప్రజలు ఇంకెంత కాలం భరించే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు.
ఓడి పోయిన కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన వారికంటే ఎక్కువగా పెత్తనం చెలాయిస్తున్నారని ధ్వజమెత్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.