సీఎంపై భగ్గుమన్న ఆర్ఎస్పీ
కేసీఆర్ ప్రస్తావన లేకుంటే ఎలా
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఇవాళ ప్రతిపక్షాలను బంధించి, వారి గొంతు నొక్కి అసెంబ్లీ లో ఏక పక్షంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
చరిత్ర లో డిసెంబర్ 9వ తేదీ ప్రాశస్త్యం గురించి మీరు చేసిన ప్రసంగం దారుణంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా పేరు పొందిన కేసీఆర్ ప్రస్తావన లేక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
కేసీఆర్ వీరోచిత పోరాట ప్రస్తావనే లేకపోవడం సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతున్నదన్నారు. ఆంధ్ర పాలకుల స్క్రిప్ట్ ను తప్పుల్లేకుండా చదివారని ఎవరికైనా ఇట్టే తెలిసి పోతుందన్నారు.
నవంబర్ 29 న కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధం కాకపోతే డిసెంబర్ 9 న నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసేదా అని నిలదీశారు ఆర్ఎస్పీ. జై తెలంగాణ అనే ధైర్యం లేని మీరు తెలంగాణ తల్లి విగ్రహానికి రావాలని కోరడం దారుణమన్నారు. మీకు అదానీ, ఆమ్ దానీ యే ముఖ్యమని తెలంగాణ సంస్కృతి కాదన్నారు.