అహంకారం తగ్గించుకుంటే మంచిదని కామెంట్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అధికారం ఉంది కదా అని మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. పూర్తిగా కుల దురహంకారంతో వ్యవహరిస్తున్న సీఎంకు తనను విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. పదవిని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నీకు అంత సీన్ లేదంటూ ఫైర్ అయ్యారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మీ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ కు తీరని నష్టం జరుగుతోందంటూ ధ్వజమెత్తారు. అందుకే తాను మీపై నార్సింగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను ఎందు కోసం ఫిర్యాదు చేశాననే విషయం తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. అయినా నిలువెల్లా అహంకారంతో నిండిన సీఎంకు ప్రజా సమస్యలు అర్థం అవుతాయని తాను అనుకోవడం లేదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .
అంతులేని అహంకారంతో, అధికార మదంతో, అల్ప బుద్దితో, సంకుచితమైన మనస్తత్వంతో మాట్లాడుతూ అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారని ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.