బీజేపీ కార్పొరేటర్ పై ఆర్ఎస్పీ ఫైర్
ధీరజ్ రెడ్డి దాడి దారుణం
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కావాలని బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉషా దాసరి తండ్రి దాసరి హనుమయ్యపై ఆర్కే పురం బీజేపీ కార్పొరేటర్ ధీరజ్ రెడ్డి హత్యా యత్నానికి పాల్పడడం పట్ల మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తన అనుచరులతో తీవ్రంగా గాయపర్చడాన్ని ఖండించారు.
డబ్బులు ఇస్తానని తన ఆఫీసుకు పిలిపించుకొని రక్తం వచ్చేలా కొట్టారని, పథకం ప్రకారమే హత్యకు కుట్ర ప్న్నారంటూ ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తనన చంప వద్దంటూ ప్రాధేయ పడినా పట్టించు కోలేదన్నారు. ధీరజ్ రెడ్డి, ఆయన అనుచరులు జరిపిన దాడికి సంబంధించి పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు.
ధీరజ్ రెడ్డి మీద ఎన్నో భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని, పీడీ యాక్టు కింద జైళ్లలో ఉండాల్సిన రౌడీని కార్పొరేటర్ గా చేస్తే పరిస్థితి ఇట్లాగే ఉంటుందన్నారు. ఇంత జరిగినా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాచకొండ ఎస్పీని ప్రశ్నించారు ఆర్ఎస్పీ.