భట్టికి అవమానం ఆర్ఎస్పీ ఆగ్రహం
నరసింహుడి సాక్షిగా అవమానం
హైదరాబాద్ – బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ముఖ్యమంత్రిపై, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రధానంగా రాష్ట్రంలో ధనిక సామాజిక వర్గాలు అనుసరిస్తున్న విధానాలపై భగ్గుమన్నారు.
యాదగిరిగుట్ట ఆలయంలోని శ్రీలక్ష్మీ నరసింహ్మ స్వామి సాక్షిగా దళితుడైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం దీనిని ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
సీఎం రేవంత్ రెడ్డి తన కుల దురహంకారాన్ని పదే పదే ప్రదర్శిస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి సాక్షిగా జరిగిన తీరు దారుణమని పేర్కొన్నారు. భట్టి విక్రమార్కకు జరిగిన అవమానానికి సంబంధించిన ఫోటోలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు ఆర్ఎస్పీ.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కంటే ముందు వరుసలో కూర్చునే అర్హత భట్టి విక్రమార్కకు లేదా అని బీఎస్పీ చీఫ్ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు .