NEWSTELANGANA

మోత్కుప‌ల్లికి ర‌క్ష‌ణ క‌ల్పించండి

Share it with your family & friends

రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్పీ ఫైర్
నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – బీఆర్ఎస్ లోక్ స‌భ అభ్య‌ర్థి, సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన వారిని ప‌నిగ‌ట్టుకుని వేధింపుల‌కు గురి చేయ‌డం, రాజ‌కీయంగా వారిని ప‌క్క‌న పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు.

ప్ర‌ధానంగా సుదీర్ఘ‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని చెప్ప‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కంటే మాజీ సీఎం కేసీఆర్ న‌యం అని చెప్ప‌డం, న‌ర న‌రాన దుర‌హంకారం త‌ల‌కెక్కించుకున్న సీఎం ప‌ట్ల జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. మోత్కుప‌ల్లికే ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో సామాన్యుల ప‌రిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఆలోచించు కోవాల‌ని హెచ్చ‌రించారు బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి.

ఇక‌నైనా ద‌ళితులు మారాల‌ని లేక పోతే అగ్ర‌కుల మోసాలు, దౌర్జ‌న్యాల‌కు బ‌లి కావాల్సి వ‌స్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.