కాంగ్రెస్ మోసం రైతులకు శాపం
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజల చెవుల్లో పూలు పెట్టారంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ట్విట్టర్ వేదికగా మంగళవారం స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ రైతులను నట్టేటా ముంచిందని ఆవేదన చెందారు.
చివరకు చివరికి పేద రైతులను విషం తాగే స్థాయికి దిగజార్చారంటూ మండిపడ్డారు. ఇలాంటి దౌర్జన్యాలు ప్రతి చోటా జరుగుతున్నాయని , ఎక్కడా ఎవరూ రైతులకు జవాబుదారీగా ఉండడం లేదని ఆరోపించారు.
చింతకానిలో ఇది బయట పడ్డదన్నారు. అన్ని ఆధారాలతో ఏ అధికారి దగ్గరికి పోయి ఫిర్యాదు చేసినా ఒకటే సమాధానం చూస్తం..చేస్తం..నువ్వు ఇంటికి పో..అని దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారని వాపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
కనీసం ఫిర్యాదును తీసుకున్నట్టుగా రసీదు కూడా ఇస్తలేరని ఆరోపించారు. అధికార పార్టీకి ఒక న్యాయం మిగతా వారికి మరో న్యాయాన్ని అమలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రైతులు ఎవరూ ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.