NEWSTELANGANA

ప్రాణాలు పోతే ప‌ట్టించుకోరా

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఆర్ఎస్పీ

సూర్యాపేట – విద్యార్థినులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే ఎందుకు రేవంత్ రెడ్డి స‌ర్కార్ స్పందించ‌డం లేద‌ని నిల‌దీశారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ద‌గ్గుపాటి వైష్ణ‌వి కుటుంబానికి న్యాయం చేయాల‌ని కోరుతూ చేప‌ట్టిన ధ‌ర్నాలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌సంగించారు.

మృతురాలి తల్లిదండ్రులు నినదిస్తున్నది ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కోసం కాదు..వాళ్ళ బిడ్డల ప్రాణాలకు గ్యారంటీ కావాలని పుట్టెడు శోకంలో బాధా తప్త హృదయాలతో నినదిస్తున్నారని వాపోయారు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు పూర్తయింది. కానీ ముఖ్యమంత్రి
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించ లేద‌ని ఆరోపించారు. ఈ బిడ్డల గోడు ఎవరికి చెప్పుకోవాలని ప్ర‌శ్నించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

అసెంబ్లీలో అన్నీ చర్చిస్తున్నారు కానీ, గురుకులాల వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై మాత్రం చర్చ జరగడం లేదు ఎందుక‌ని నిల‌దీశారు. ఈ బిడ్డ‌ల ప్రాణాల‌కు విలువ లేదా అని వాపోయారు.