NEWSTELANGANA

కాంగ్రెస్ స‌ర్కార్ పై ఆర్ఎస్పీ క‌న్నెర్ర‌

Share it with your family & friends

బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సుకు ఎంట్రెన్స్ ఎందుకు

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ ఏం చేస్తుందో తెలియ‌డం లేద‌న్నారు. ప్ర‌ధానంగా విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించింద‌ని ఆరోపించారు. అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు విద్యా శాఖ మంత్రి లేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు ఆర్ఎస్పీ.

ఆయ‌న ప్ర‌ధానంగా బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర రాష్ట్రాల‌లో బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సుకు సంబంధించి ఎలాంటి ప్ర‌వేశ ప‌రీక్ష‌లు లేకుండానే అడ్మిష‌న్స్ తీసుకుంటున్నార‌ని తెలిపారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సుకు సంబంధించి ఎంసెంట్ లేదా నీట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించి ఉండాల‌ని నిబంధ‌న‌లు పెట్టార‌ని ఆరోపించారు. వెంట‌నే నీట్, ఎంసెట్ ను ప్రాతిప‌దిక‌గా తీసుకోకుండా నేరుగా విద్యార్హ‌త‌ల‌ను బ‌ట్టి అడ్మిష‌న్స్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.