NEWSTELANGANA

స‌ర్కార్ తీరుపై ఆర్ఎస్పీ ఫైర్

Share it with your family & friends

ప‌ర్మిష‌న్ లేకుండా ఓయులోకి ఎలా

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ న్యాయ ప‌ర‌మైన డిమాండ్ల సాధ‌న కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న నిరుద్యోగుల ప‌ట్ల పోలీసులు అనుస‌రిస్తున్న దాడుల‌ను తీవ్రంగా ఖండించారు.

గురువారం ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్బంగా పోలీసులు దారుణంగా కొడుతున్న వీడియోను షేర్ చేశారు. ఇదేనా ప్ర‌జా పాల‌న అని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా 2 ల‌క్ష‌ల జాబ్స్ ఇస్తామ‌ని చెప్పిన హామీ ఎటు పోయిందంటూ నిల‌దీశారు.

తెలంగాణ బిడ్డ‌ల‌ను ప‌నిగ‌ట్టుకుని దాడుల‌కు దిగ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇంత‌కు ఎవ‌రి ప‌ర్మిష‌న్ తీసుకుని ఉస్మానియా యూనివ‌ర్శిటీలోకి ప్ర‌వేశించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఆర్ఎస్పీ. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. న‌డ్డి విరిగేలా దాడి చేయ‌మ‌ని పోలీసుల‌కు ఎవ‌రు ప‌ర్మిష‌న్ ఇచ్చార‌ని లేక ఇత‌ర రాష్ట్రం నుండి ఏమైనా ఆదేశాలు వ‌చ్చాయా అని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఆనాడు తెలంగాణ ఉద్య‌మం ఊపందుకున్న స‌మ‌యంలో కూడా పోలీసుల‌ను ఓయు క్యాంప‌స్ లోకి రానీయ లేద‌ని అన్నారు.