బిడ్డల ఆక్రందన ఆర్ఎస్పీ ఆవేదన
పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్ – బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి లోనవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ సర్కార్ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు.
గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. సూర్యాపేట కలెక్టరేట్ ఎదురుగా వందలాది మంది డిగ్రీ కాలేజీ అమ్మాయిలు తమ ప్రిన్సిపాల్ ను బదిలీ చేయాలంటూ ఆందోళన బాట పట్టడం దారుణమన్నారు.
వాళ్లు నిరసన పాటలతో పోరాటం శాంతియుతంగా జరిగినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. తర తరాలుగా బహజన బిడ్డలు ఇలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారంటూ వాపోయారు. ఈ పరంపరకు అంతం లేదా ..ఈ ఆందోళనలు ఆగవా అని నిలదీశారు.
వీరంతా ఎప్పుడు చదువుకుని డాలర్లు సంపాదిస్తారంటూ ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక గత కొన్ని నెలలుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు అందడం లేదని , వెంటనే చెల్లించాలని కోరారు.