కాంగ్రెస్ సర్కార్ పై ఆర్ఎస్పీ కన్నెర్ర
140 మంది అభ్యర్థులకు ట్రైనింగ్ కథేంటి
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాయ మాటలు చెప్పడంలో టాప్ లో నిలిచారంటూ పేర్కొన్నారు.
2022 లో జరిగిన పోలీస్ నియామకాల్లో భాగంగా ఎంపికైన 140 మంది అభ్యర్థులకు ఇంకా శిక్షణకు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రశీణ్ కుమార్. బోనఫైడ్ మెడికల్ విచారణలో కూడా క్లియర్ గా వచ్చినా ఇప్పటి వరకు ఎందుకని 70 మందికి ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ నిలదీశారు .
పేద కుటుంబం లోంచి వచ్చిన వారంతా 2 సంవత్సరాల నుంచి కష్ట పడ్డారని, వారంతా శ్రమకోర్చి ప్రిపేర్ అయ్యారని , చివరకు శిక్షణ కు పంపించకుండా వివక్ష చూపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఆర్ఎస్పీ. వాళ్ల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారంటూ సీఎం ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏమిటి అంటూ , ఎక్కడ భర్తీ చేశారంటూ మండిపడ్డారు.