NEWSTELANGANA

కాంగ్రెస్ మోసం మాదిగ‌ల‌కు ద్రోహం

Share it with your family & friends

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ఫైర్

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – బీఆర్ఎస్ నాయ‌కుడు , నాగ‌ర్ క‌ర్నూల్ లోక్ స‌భ పార్టీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీన్ కుమార్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మాదిగ‌ల‌కు సీట్లు ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్య‌మంలో, పున‌ర్ నిర్మాణంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తూ వ‌చ్చార‌ని అన్నారు.

నాగర్ కర్నూల్ పట్టణంలో మాదిగల రాజకీయ ఐక్య వేదిక అధ్వర్యంలో జరిగిన బహుజన మహనీయుల జయంతి ఉత్సవాల సభ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు ముఖ్య అతిథిగా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో అత్యధిక జనాభా క‌లిగిన‌ మాదిగలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వకుండా తీరని అన్యాయం చేసిందని ఐక్య వేదిక నాయకులు ఖండించారు. వారికి ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకే ఆ పార్టీ కుట్ర చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో మాదిగ‌ల‌కు సీటు ఇవ్వ‌కుండా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.