నమ్మక ద్రోహం కాంగ్రెస్ నైజం
దేశంలో ఎమర్జెన్సీకి 50 ఏళ్లన్న ఆర్ఎస్పీ
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. ఈ దేశాన్ని సర్వ నాశనం చేసింది ఆ పార్టీనేనంటూ మండిపడ్డారు.
కేవలం ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం, ఒక వ్యక్తి ఈగో కోసం 21 నెలలపాటు ఈ దేశం మనుషుల్ని కోల్పోయిందన్నారు. అదే ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీకి నేటితో 50 ఏళ్లు పూర్తైందని గుర్తు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
దేశాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం కోసం రాజ్యాంగం రద్దైందన్నారు. అత్యంత ఘోరం ఏందంటే .. మనుషులు జీవించే హక్కు ఆర్టికల్ 21ని కూడా రద్దు చేశారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమని ఆవేదన వ్యక్తం చేశారు.
మనుషుల్ని రోడ్లపై పడుకోబెట్టి బలవంతంగా స్టెరిలైజ్( కుటుంబ నియంత్రణ ఆపరేషన్) చేశారని, అంతే కాదు ప్రతిపక్ష నాయకులను జైళ్లలో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాజాగా మోసానికి, దగాకు పాల్పడిన ఈ పార్టీ ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుతామంటూ తెగ డ్రామాలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు.