పెద్దల భవంతులు వదిలేస్తే ఎలా..?
నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో పెద్దల భవంతులను వదిలేసి పేదల ఇళ్లను కూల్చడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
హైదరాబాద్ శివార్లలో ఉన్న బండ్లగూడ జాగీర్ మునిసిపాలిటీ లో ఉన్న ఏకంగా పీరాన్ చెరువులో యధేచ్చగా పెద్ద పెద్ద భవంతులు కడుతున్నారని ఆరోపించారు.
ఎవరైనా అడిగితే తమకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి తెలుసు అని, ఆర్ ట్యాక్స్ కడతామంటూ చెబుతుండడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కోర్టుకు ఎలా పోవాలో తమకు తెలుసు అంటూ చెబుతున్న వారి పట్ల ఎందుకు ఉదాసీన వైఖరిని అనుసరిస్తున్నారంటూ ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఉన్నోళ్లకు వెసులుబాటు కల్పించడం, పేదలకు సంబంధించి ముందస్తు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం శనివారం, ఆదివారంలలో మాత్రమే ఇళ్లను కూల్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో చెప్పాలని నిలదీశారు బీఆర్ఎస్ సీనియర్ నేత.
కేవలం పేదోళ్లకు చెందిన ఇళ్లను మాత్రేమే ఎందుకు కూల్చాల్సి వస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైడ్రా, సీఎం కావాలని పేదలను టార్గెట్ చేయడం దారుణమన్నారు.