అహంకారి మల్లు రవిని ఓడించాలి
పిలుపునిచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నాగర్ కర్నూల్ జిల్లా – అధికారం ఉంది కదా అనే గర్వంతో ప్రజలను చిన్న చూపు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి. తన ముందు కూర్చోవద్దు అంటూ ఓ నాయకుడిని తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తీరు కూడా అలాగే ఉందనే విమర్శలు కూడా వచ్చాయి.
ప్రధానంగా దేశంలోనే పేరు పొందిన మీడియా జర్నలిస్ట్ బర్ఖా దత్ సీఎంపై సీరియస్ కామెంట్స్ చేశారు. తన నడుముపై చేయి వేసి సెక్యూరిటీ సిబ్బంది లాగేసినా, కెమెరా మెన్ ను పక్కకు తోసేసినా రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకున్నారంటూ బాంబు పేల్చారని తెలిపారు. ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా మల్లు రవి ప్రదర్శించిన అహంకార పూరిత ధోరణిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజల కోసం పని చేయాల్సిన సదరు నాయకుడు తన వద్దకు వచ్చిన వ్యక్తిని అవమానిస్తే ఎలా అని ప్రశ్నించారు.