జూపల్లి అరాచకం ఆర్ఎస్పీ ఆగ్రహం
శ్రీధర్ రెడ్డి హత్యకు మంత్రి, సర్కార్ కారణం
నాగర్ కర్నూల్ జిల్లా – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సర్కార్ ను ఏకి పారేశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యకు మంత్రితో పాటు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
కాంగ్రేసు ప్రభుత్వానికి , మంత్రి జూపల్లి ప్రతీకారానికి ఒక నిండు ప్రాణం కోల్పోయిందని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేవలం బీఆరెస్ పార్టీలో ఉండి లక్ష్మీపల్లి ప్రజలను చైతన్యం చేయడమే శ్రీధర్ రెడ్డి చేసిన నేరమా అని నిలదీశారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంటే చంపేస్తరా?? పోలీసులను వేడుకున్నా రక్షణ దొరకదా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
శ్రీధర్ రెడ్డిగారి అంతిమ యాత్రలో పాల్గొన్న అశేష జనావళికి వందనాలు తెలియ చేసుకుంటున్నామని పేర్కొన్నారు. తీవ్రమైన విషాదంలో ఉన్న స్థానిక కార్యకర్తలను ఓదార్చడానికి కొల్లాపూర్ కు వచ్చి అందరితో పాటు నడిచి చివరి వరకు మీ వెంటే ఉంటానని ధైర్యమిచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలియ చేశారు.