ప్రమాదంలో భారత రాజ్యాంగం
ఆవేదన వ్యక్తం చేసిన ఆర్ఎస్పీ
వనపర్తి జిల్లా – నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. గురువారం వనపర్తిలో పార్లమెంట్ ఎన్నిలక సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్ఎస్పీ.
ప్రస్తుతం దేశంలో కొలువుతీరిన కాషాయ పార్టీ కేవలం తను మాత్రమే ఉండాలని అనుకుంటోందన్నారు. ఒకే దేశం ఒకే జాతి ఒకే భాష పేరుతో జనాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు . ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ బలమైన ముద్ర కనబర్చడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం , రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గెలవాలంటే… బీఆర్ఎస్ కే ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా చివరి నిమిషం వరకు నిరంతరం కష్టపడి, పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.