కవిత..కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ కామెంట్
హైదరాబాద్ – బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కావాలని ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిందంటూ మండిపడ్డారు. ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పూర్తిగా కక్ష సాధింపు ధోరణితో సాగుతోందని అన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో కావాలని ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందంటూ మోదీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఈ కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కేసు అప్రూవర్ల వాంగ్మూలాలపై ఆధారపడి ఉందన్నారు. ఎవరైనా అప్రూవర్ గా ఉండవచ్చని చెప్పారు. ఈడీకి ఎలాంటి రుజువు ఉందో, ఒత్తిడిలో ఎవరైనా ఒప్పుకోలు స్టేట్‌మెంట్ ఇవ్వవచ్చని అన్నారు.
ఈ నేరాంగీకార ప్రకటనలలో వాస్తవం ఉందా? అరవింద్ కేజ్రీవాల్‌ను ఎలా అరెస్టు చేయగలిగారు అని నిలదీశారు ఆర్ఎస్పీ. నకిలీ సాక్ష్యాధారాలతో కవిత, కేజ్రీవాల్ , సిసోడియా, సత్యేందర్ జైన్ , హేమంత్ సోరేన్ లను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.