మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకున్నా
అలంపూర్ – బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ప్రసిద్ద పుణ్య క్షేత్రాన్ని సందర్శించారు. సోమవారం ఆయన గద్వాల జిల్లా ఆలంపూర్ పట్టణంలో అత్యంత ప్రాచీన మైన చాళక్యుల కాలం నాటి పాపనాశి దేవాలయాన్ని దర్శించుకున్నారు.
భారత రాజ్యాంగాన్ని కాపాడే పోరాటంలో మమ్మల్నందరినీ ఆశీర్వదించాలని పూజలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు బీఎఎస్పీ చీఫ్ కు ఆశీర్వచనాలు అందజేశారు. ప్రసాద వితరణ చేపట్టారు.
ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి ఘనమైన చరిత్ర, వారసత్వ సంపద ఉందన్నారు. అంతే కాకుండా ప్రజలను కష్ట కాలంలో కాపాడే ఆలయాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు.
భారత దేశంలోనే అత్యంత శక్తివంతమైన పీఠాలలో ఆలంపూర్ జోగుళాంబ దేవాలయం ఒకటి అని పేర్కొన్నారు. ఇవాళ ఈ ప్రాంతానికి చెందిన తాను ఇక్కడికి రావడం, గుడిని దర్శించు కోవడం మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.