రాష్ట్రంలో హోం మంత్రి ఎవరు – ఆర్ఎస్పీ
డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ జరిగితే ..రక్షణ ఎక్కడ
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పాలన అనేది ఉందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా శాంతి భద్రతల గురించి ప్రస్తావించారు.
రాష్ట్రంలో అసలు హోం మంత్రి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విచిత్రం ఏమిటంటే సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నివాసంలో చోరీ జరగడం, దొంగలు దొరకడం విడ్డూరంగా ఉందన్నారు.
నిరంతర పోలీసు పహారాలో, సీసీ టీవీ కెమెరాల నిఘాలో, ముళ్ల కంచెల మధ్యలో ఉన్న డిప్యూటీ సీఎం ఇంట్లోనే చోరీ జరుగుతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అని నిలదీశారు.
అదీ బీహార్ నుండి వచ్చి దొంగతనం? దొరికింది ఖరగ్ పూర్లో. పట్టుకున్నది బెంగాల్ పోలీసులు..మరి మన పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. హైడ్రా కు బందో బస్తుగా వెళుతున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు ఆర్ఎస్పీ.
ఇంతకూ మన హోం మంత్రి ఎవరు? ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు.